మన HCUకు ఐదో స్థానం.. ఫస్ట్ ప్లేస్ ఏ యూనివర్సిటీకి తెలుసా? IIRF 2025 ర్యాంకింగ్స్ విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-06-13 13:06:51  IST  )

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (IIRF) 2025 నివేదిక ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐదో స్థానంలో నిలిచింది.

మన HCUకు ఐదో స్థానం.. ఫస్ట్ ప్లేస్ ఏ యూనివర్సిటీకి తెలుసా? IIRF 2025 ర్యాంకింగ్స్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (IIRF) 2025 నివేదిక ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఐదో స్థానంలో నిలిచింది. దక్షిణాదిన చూస్తే (University of Hyderabad) సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ప్లేస్‌మెంట్ పనితీరు, బోధనా , పరిశోధన అవుట్‌పుట్, ఆవిష్కరణలు వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రతి ఏడాది IIRF వర్సిటీల ర్యాంకింగ్స్ విడుదల చేస్తోంది. గత ఏడాది సైతం హెచ్‌సీయూ టాప్ 10 జాబితాలోనే ఉంది. అయితే ప్రస్తుత జాబితాలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) అగ్రస్థానంలో ఉంది.

సంస్థ ప్రమాణాల ప్రకారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొత్తం ఇండెక్స్ స్కోరు (ఓఐఎస్) 988.93 స్కోరు సాధించగా అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) 994.89 స్కోరును సాధించింది. వీటితో పాటు (DU)ఢిల్లీ యూనివర్సిటీ 993.86, (BHU) బనారస్ హిందూ విశ్వవిద్యాలయం 992.35 ,(JMI) జామియా ఇస్లామియా 990.48 స్కోరు కలిగి ఉన్నాయి. ఇక గతంలో ఆరో ప్లేస్‌లో ఉన్న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఆరో స్థానానికి చేరుకుంది. ఇక, ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ దేశవ్యాప్తంగా 2500 కి పైగా వర్సిటీల విద్యా ప్రమాణాలను పరిశోధన చేసి ర్యాంకింగ్స్ విడుదల చేసింది.

Next Story