- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచార్ సాథీ యాప్ వినియోగించాల్సిందే! ప్రజలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య విజ్ఞప్తి
సంచార్ సాథీ యాప్ వినియోగించాలని ప్రజలకు కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సంచార్ సాథీ యాప్ వినియోగించాలని ప్రజలకు కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (మంగళవారం) మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి యాప్‌ను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ ఫ్రాడ్లకు గురయ్యారని, ఇప్పటివరకు రూ.23 వేల కోట్లు నష్టపోయారని వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్నవారే ఎక్కువగా మోసపోతున్నారని వెల్లడించారు.
సైబర్ నేరాలను అరికట్టడం, ఫోన్ దొంగతనం, నకిలీ సిమ్‌లు, ఫ్రాడ్ కాల్స్ వంటి సమస్యలను గుర్తించడానికి సంచార్ సాథీ యాప్‌ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దొంగిలించిన ఫోన్ ఎక్కడ అమ్ముడవుతోందా వంటి కీలక సమాచారాన్ని కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 కోట్లు 20 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 26 లక్షల మొబైల్ ఫోన్లు దొంగిలించబడ్డ కేసుల్లో, 7 లక్షల ఫోన్లను రికవరీ చేసినట్లు కూడా వెల్లడించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, సంచార్ సాథీ యాప్‌లో ఏ విధమైన భద్రతా సమస్యలూ లేవని స్పష్టం చేశారు.
గత సంవత్సరం తీసుకుంటే, 5 మిలియన్ల మంది అంటే 50 లక్షల మంది సైబర్ మోసం కారణంగా ప్రభావితమయ్యారని చెప్పారు. ప్రస్తుతం, 1.4 కోట్ల మంది ఈ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. 21 కోట్ల మంది సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. ట్వీట్ ఇదే..






