- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిక బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం అని లేఖలో నిలదీశారు. ఉద్యోగులకు రోటీన్‌గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజాయతీగా పనిచేసే ఉద్యోగులకు ఏ సందేశం ఇస్తున్నట్లు? కళాశాలల యాజమాన్యాల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారని ఆరోపించారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా.. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలంటూ కిషన్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ విడుదల చేయాలని సూచించారు.






