తెలంగాణలో యూరియా కొరత.. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కుండబద్దలు కొట్టిన కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |

తెలంగాణలో యూరియా(Urea) కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు.

తెలంగాణలో యూరియా కొరత.. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కుండబద్దలు కొట్టిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో యూరియా(Urea) కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు రూ.76 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు. యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారని.. రైతులు సమస్యలు తీర్చాలని యూరియా ఇస్తాం.. అది కేంద్ర ప్రభుత్వంగా తమ బాధ్యత అని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం.. అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు.

రైతుల విషయంలో కేంద్రం కమిట్‌మెంట్‌తో ఉందని.. అందుకే అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా.. రైతులకు మేలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ మంత్రులు రోజూ యూరియా లేదని మాట్లాడటం కారణంగా.. దొరికిన చోట కొందరు దీన్ని స్టోర్ చేసుకోవడం కారణంగా సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. 11 ఏళ్లలో ఏనాడూ యూరియా కొరత ఏర్పడలేదు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉందని అడిగారు. ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల సప్లయ్ జరిగింది. మరో 2 లక్షల యూరియా అందుబాటులోకి తీసుకొస్తాం. వర్షాలు బాగా కురిశాయి. రైతులు పంట వేశారు. అందుకోసం వారికి సహకరించాల్సిన బాధ్యత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది అని కిషన్ రెడ్డి అన్నారు.ల

Next Story