సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

by Ramesh Naini |   (  Updated:2026-01-06 10:43:11  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ జి. కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ జి. కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరంగల్ కోట పరిధిలోని భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాల అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ కోట భూముల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించి వెంటనే తొలగించాలని సీఎంను కోరారు.

పురావస్తు శాఖకు అప్పగించాలి

కోట భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసి, ఆ భూములను పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. దేశ వారసత్వ సంపదను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. వరంగల్ కోట వంటి చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అక్రమ ఆక్రమణల వల్ల వాటి అసలు స్వరూపం దెబ్బతింటోందని కిషన్‌రెడ్డి తెలిపారు. వరంగల్ కోట పరిరక్షణకు ఏఎస్ఐ చేపడుతున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కోట పరిసరాలను పరిరక్షిస్తే భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించినట్లవుతుందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

Next Story