BJP అధ్యక్ష రేసులో ఈటల ఉన్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీజేపీ(Telangana BJP) అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP అధ్యక్ష రేసులో ఈటల ఉన్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(Telangana BJP) అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడికి RSS బ్యాక్‌గ్రౌండ్‌ అవసరం లేదని అన్నారు. రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం(Active membership of BJP) ఉంటే చాలని చెప్పారు. రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంతేకాదు.. ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో(Sankranti celebrations) మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడంపైనా కిషన్ రెడ్డి స్పందించారు. ‘నామాట కాదనకుండా పిలిస్తే చిరంజీవి(Megastar Chiranjeevi) వస్తారు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరం ఒకరిని ఒకరం కుటుంబ సభ్యుల్లా భావిస్తాం’ అని అన్నారు. ఆయనతో పాటు అనేకమంది సినీ ప్రముఖులతో బీజేపీకి సంబంధాలున్నాయని తెలిపారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు, కేంద్రమంత్రులు కూడా అయ్యారని అన్నారు.

Next Story