- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే జూబ్లీహిల్స్ ఎన్నికలకు వెళ్లాలి.. కాంగ్రెస్ సర్కార్‌కు కిషన్ రెడ్డి సూచన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) తరహాలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలన సాగుతోందన్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగనుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. తప్పకుండా బీజేపీకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేశాకే జూబ్లీహిల్స్ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అంతకుముందు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీలింగ్ ఎత్తివేతపై అవగాహన లేకుండా ముందుకెళ్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు డెడ్‌లైన్‌తో హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇది లీగల్‌గా నిలబడే అవకాశం లేదని రఘునందన్‌రావు అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు అవగాహన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. ప్రత్యేక జీవోలతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని అన్నారు. లీగల్‌గా వచ్చే అడ్డంకులకు కాంగ్రెస్‌దే బాధ్యత అని చెప్పారు. ముస్లింలను జతచేసి బీసీ రిజర్వేషన్లంటే ఎలా సాధ్యం అని అనుమానం వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.






