- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డికి అవగాహన లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రక్రియపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు. డీలిమిటేషన్ విషయంలో వస్తున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూ, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "మేమూ దక్షిణాదిలోనే ఉన్నాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వం" అని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అంచనా వేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు వంటి కీలక అంశాలను రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. "ఈ మొత్తం విషయాన్ని రేవంత్ రెడ్డి విచక్షణకే వదిలేస్తున్నా" అని ఎద్దేవా చేశారు.






