TG: టెన్త్ క్లాస్ విద్యార్థులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కానుక

by Gantepaka Srikanth |

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన(Hyderabad Collector Harichandana)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు.

TG: టెన్త్ క్లాస్ విద్యార్థులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కలెక్టర్ హరిచందన(Hyderabad Collector Harichandana)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా, ఇటీవలే బండి సంజయ్ కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులందరికీ టెన్త్ పరీక్ష ఫీజును తానే భరించడానికి ముందుకు వచ్చారు. తనకు వచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు కూడా రాసి పంపించారు. పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ఇద్దరూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Next Story