- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచస్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్! 46% పనులు పూర్తి: కేంద్ర మంత్రి ట్వీట్
ప్రపంచస్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచస్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రూపుదిద్దుకుంటోంది. (Amrit Bharat) అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ. 714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆదివారం ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రైల్వే నెట్‌వర్క్ మరింత బలపడటంతో పాటు, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, ఇది దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రముఖ రైల్వే కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. ట్వీట్ ఇదే..
ఇప్పటికే పూర్తైన పనులు:
- రైల్వే ప్లాట్‌ఫాం భవనం
ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమైన పనులు:
- సౌత్ బేస్‌మెంట్
- సౌత్ మెయిన్ బిల్డింగ్
- నార్త్ వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్
- బేస్‌మెంట్‌తో కూడిన నార్త్ మెయిన్ బిల్డింగ్
- ఎయిర్ కాంకోర్స్
- కవర్ ఓవర్ ప్లాట్‌ఫాం
- కాజీపేట్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
- హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
- స్టేషన్ వెంట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్-కమ్ ట్రావెలేటర్






