- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్టు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఇంతకీ ఆ పోస్టు ఏంటో తెలుసా?
కాంగ్రెస్ సోషల్ మీడియా(Congress social media) బృందంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సోషల్ మీడియా(Congress social media) బృందంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరిచిపోయారని విమర్శలు చేశారు. ప్రధాని మోడీని కించపరిచేలా సోషల్‌మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా నుంచి తల లేని నేత ఫొటోను గాయబ్ అనే స్లోగన్‌తో పోస్టు చేశారు. మోడీ తల లేని ఫొటో పెట్టి అవమానించారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అంటూ విమర్శలు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పోస్టుపై ఢిల్లీ సీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్(Sunil Bansal) హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా జూలైలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏవిధంగా సిద్ధంగా కావాలనే విషయంపై సీనియర్లు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు, పెండింగ్‌లో ఉన్న జిల్లాల అధ్యక్షుల నియమాకంపై కూడా చర్చ జరగనున్నట్లు సీనియర్లు వెల్లడించారు.






