- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: రష్యన్ ఎనర్జీ వీక్ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం
రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాల్సిందిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రష్యాలోని మాస్కోలో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరగనున్న రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సు(Russian Energy Week 8th International Conference)కు హాజరు కావాల్సిందిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)కి ఆహ్వానం అందింది. ఈ మేరకు రష్యా ఫెడరేషన్ రాయబారి కార్యాలయం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు రష్యన్ ఎనర్జీ వీక్ ఆర్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆంటన్ కొబ్యాకోవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. రాస్ కాంగ్రెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సులో క్రియేటింగ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఫ్యూచర్ టుగెదర్ అనే అంశంపై 3 రోజుల పాటు చర్చ జరగనుంది. చమురు, గ్యాస్, బొగ్గు పరిశ్రమ, విద్యుత్ శక్తి, డిజిటల్ టెక్నాలజీ, శాస్త్ర, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత తదితర రంగాలకు సంబంధించి అనేక అంశాలపై చర్చించనున్నారు. అనేక దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్స్, నిపుణులు తదితరులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొననున్నారు.






