- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికారు.

X
దిశ, చార్మినార్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులతో పాటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్వామి గౌడ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయానికి భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నారు.
Next Story






