Kishan Reddy : సీఎం రేవంత్ మొనగాడు కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
Kishan Reddy : సీఎం రేవంత్ మొనగాడు కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్‌ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం 2025 నాటికి ఇండియాను పూర్తి హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై ఆయన పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదని.. తమ అజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ చేస్తోన్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం గట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.



Next Story

Most Viewed