Kishan Reddy: బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా ఎలా దొరుకుతుందో చెప్పాలి..? కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-08-22 13:41:38  IST  )

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.400కి యూరియా (urea) దొరుకుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Kishan Reddy: బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా ఎలా దొరుకుతుందో చెప్పాలి..? కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్లాక్‌ మార్కెట్‌లో రూ.400కి యూరియా (urea) దొరుకుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. యూరియాపై రూ.2200 నుంచి రూ.2400 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రైతుకు రూ.260కి అందాల్సిన యూరియా.. బ్లాక్‌ మార్కెట్‌లో రూ.400కి దొరుకుతుందని ఆరోపించారు. (black market) బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా ఎలా దొరుకుతుందో (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువుల కృత్రిమ కొరత లేకుండా చూడాలని సూచించారు. ఒక్క బస్తా యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని సూచనలు చేశారు.

హైదరాబాద్ సమస్యలపై సచివాలయం వద్ద నిరసనకు పిలుపునిస్తే మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లో భూముల అక్రమ వ్యాపారం హెల్‌సేల్‌గా సాగుతోందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల భూములు అమ్మితే నేడు హోల్ సేల్ వ్యాపారం సాగుతోందని ఆరోపించారు.

Next Story