డాడీ.. డాటర్ మ్యాటర్.. కవిత ఎపిసోడ్‌పై స్పందించిన కిషన్‌రెడ్డి

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కవిత ఎపిసోడ్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

డాడీ.. డాటర్ మ్యాటర్.. కవిత ఎపిసోడ్‌పై స్పందించిన కిషన్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కవిత ఎపిసోడ్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కవిత ఇష్యూపై స్పందించారు. ఇది డాడీ.. డాటర్, సిస్టర్.. బ్రదర్ సమస్య అని దానిపై బీజేపీ నేతలెవరూ స్పందించొద్దని సూచించారు. వారి కుటుంబానికి సంబంధించిన సమస్యలో, వాళ్ల డ్రామాలో తాము భాగస్వామ్యంకామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఇది సంబంధం లేని అంశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ఎవరు ఎవరితో చర్చించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కొద్దిరోజుల క్రితం కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కేసీఆర్ దేవుడైనా.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత రాయడంతో.. ఆ దెయ్యాలెవరన్న చర్చ మొదలైంది. ఆ తర్వాత కవిత మరో పార్టీ పెట్టనున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో కొందరు నేతలు కవితతో చర్చలు జరిపాక ఆ వ్యవహారం కాస్త చల్లబడినట్లు సమాచారం.

Next Story