రేవంత్ రెడ్డీ.. ఈ హామీల సంగతేంటి? : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

తెలంగాణను పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబం పాలించినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

రేవంత్ రెడ్డీ.. ఈ హామీల సంగతేంటి? : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబం పాలించినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. కేసీఆర్, సీఎం రేవంత్ లపై విమర్శల వర్షం కురింపించారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా వాళ్లు మాత్రం ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆ జాబ్ క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయి? అమలు చేయని హామీలు ఇందిరమ్మ ఇళ్లు, రూ.2,500 సంగతి ఏంటి ? అని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేదన్నారు. విద్యార్థులకు ఇస్తానన్న రూ.5 లక్షల భరోసా క్రెడిట్ కార్డు ఎక్కడికి పోయింది? దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఆర్థిక సహాయం చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఒక్క కుటుంబానికైనా ఆ సహాయం చేశాడా? చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇస్తానన్న లక్షకోట్లు ఎక్కడికి పోయాయి? ఈ అంశాలపై రేవంత్ రెడ్డి ప్రచారంలో ఎందుకు మాట్లాడటం లేదు? డబుల్ బెడ్రూమ్ పై కేసీఆర్ నోరు మెదపడం లేదన్నారు.

Next Story