- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు బిగ్ రిలీఫ్... యూరియా సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా (Union Minister JP Nadda). అవసరాలకు అనుగుణంగా యూరియా ( Urea) సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2023- 24 రబీతో పోలిస్తే 2024- 25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4% అదనపు వినియోగం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచనలు చేశారు జేపీ నడ్డా. దింతో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట లభించింది.
Next Story






