- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లేఖ
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ బహిరంగ లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ బహిరంగ లేఖ రాశారు. ఏపీ విభజన చట్టం 2014, గోదావరి ట్రైబ్యునల్ తదితర చట్టాలకు విరుద్ధంగా గోదావరి - బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అభ్యంతరాలు తెలుపుతూ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాయగా.. వాటిపై సీఆర్ పాటిల్ స్పందించారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు తమకు అందినట్లుగా సీఆర్ పాటిల్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రీ- ఫీజిబిలిటీ నివేదికను (PFR) కూడా పరిశీస్తున్నామని, ప్రాజెక్ట్ ప్రాథమిక సాధ్యాసాధ్యాలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గోదావరి బేసిన్ లో ఉన్న అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు సాంకేతిక అంశాలను నిబంధనల మేరకు పరిశీలిస్తామని లేఖలో పేర్కొన్నారు.






