- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును CBIకి అప్పగించింది: బండి సంజయ్
కాళేశ్వరంపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు వాడివేడిగా చర్చ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరంపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ (Justice Chandra Ghose Commission) ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో అర్ధరాత్రి వరకు వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని CBI దర్యాప్తు (CBI investigation)కు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఎక్స్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో "కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుంది. మొదటి నుండి మేము CBI దర్యాప్తును డిమాండ్ చేసాము. కానీ కాంగ్రెస్ BRS ను రక్షించి చర్యను ఆలస్యం చేసింది. ఈ రోజు ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును CBIకి అప్పగించడానికి అంగీకరించింది. లేఖను వెంటనే పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో మాదిరిగానే, కాంగ్రెస్ అసెంబ్లీలో ORR టోల్ టెండర్లపై SITని ప్రకటించింది. కానీ దానిని ఎప్పుడూ నియమించలేదు. ఇంతలో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతం కాని రోజువారీ సీరియల్‌లాగా కొనసాగుతోంది" అని బండి సంజయ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.






