- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని సీటు ఖాళీ అవ్వదు.. రాహుల్ ఆశలు వదులుకోవడమే బెటర్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సీఎం రేవంత్రెడ్డి సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణంలాంటిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్విమర్శలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సీఎం రేవంత్రెడ్డి సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణంలాంటిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదని పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ‘రాహుల్ గ్రహణం’ మూడు సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించిందని, ప్రధాని మోడీ అభివృద్ధి కిరణాలు ప్రతీసారి వెలుగునిచ్చి దేశాన్ని కాపాడాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమని నిజాం శైలి దర్బార్ కాదన్నారు. ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదని 140 కోట్ల భారతీయులు మోడీకి మూడుసార్లు మద్దతు ముద్ర వేశారని ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పేదల ఓట్లతో ఎన్నికవుతాడని హైదరాబాద్ కోటీశ్వర్ల నోట్లతో కాదని ఎద్దేవా చేశారు.
దేశం అభివృద్ధి రంగులతో హోలీ జరుపుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం అవినీతి మసితో మసకబారింది. ఆపార్టీ ఇచ్చిన గ్యారంటీలు, యువరాజు రాహుల్ఆశలను దహనం చేయడానికి దేశ ప్రజలు రాజకీయ హోలికా దహనానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత గులాల్ చల్లినా, దేశం తిరస్కరించిన నాయకుడి వైఫల్యాన్ని దాచలేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ నవ్వు చూడాలనుకుంటున్నారని కానీ చూడలేకపోతున్నారు. హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చివేతలతో కన్నీరు పెట్టుకుంటున్న పేదల బాధ, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేతతో భవిష్యత్తు అడ్డుకుపోయిన విద్యార్థుల ఆవేదన, రైతు భరోసా ఖాళీ హామీలతో మోసపోయిన రైతుల కన్నీళ్లు ఉసురు తగులుతుందన్నారు. మూసీ పునరుజ్జీవన పేరుతో ఇల్లు కోల్పోతున్న కుటుంబాల వేదన, హామీలు నెరవేరక, పెన్షన్లు, లబ్ది కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజల నిరాశ కాంగ్రెస్ను వెంటాడుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని, ఇప్పటికైనా ఆయన భజన ఆపి, పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.






