- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లిహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగింది : కేంద్రమంత్రి బండి సంజయ్
రాష్ట్రంలో ఉన్న హిందువులంతా ఓటుబ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉన్న హిందువులంతా ఓటుబ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్ పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి హాజరైన ఆయన.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లిహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. అక్కడ ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇకనైనా హిందువులు మేల్కొని ఓటుబ్యాంకుగా మారాలన్నారు.
మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా ఘర్ వాపసీ రావాలని కోరారు. హిందూమతంలోకి తిరిగి వచ్చేవారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, హిందువుగా పుట్టడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూ హిందూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఇక కార్తీక వనభోజనాలు నిర్వహిస్తోన్న అన్ని కులాల సభ్యులకు అభినందనలు తెలిపారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు.






