Sircilla floods: సిరిసిల్ల వరద బాధితులకు అండగా కేంద్ర మంత్రి.. ఆర్థిక సాయం ప్రకటన

by Ramesh Naini |

సిరిసిల్ల వరద బాధితులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు.

Sircilla floods: సిరిసిల్ల వరద బాధితులకు అండగా కేంద్ర మంత్రి.. ఆర్థిక సాయం ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిరిసిల్ల వరద బాధితులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రామచందర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. అకాల వర్షాలతో నష్టపోయిన (Siricilla flood victims) సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. (MP Lads Funds) ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు త్వరలోనే అందజేయనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందని పేర్కొన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని, పలువురు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్ నిధులు మొత్తాన్ని సిరిసిల్ల జిల్లా బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Next Story