రేపు తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!

by velandi.Saikiran |

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah )... తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. రేపు

రేపు తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah )... తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. రేపు తెలంగాణ రాష్ట్రానికి ( Telangana) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. రేపు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బేగంపేట విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకుంటారు.

రేపు మధ్యాహ్నం ఒకటి గంటల 45 నిమిషాలకు ప్రత్యేకమైన హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా ( Nizamabad) కార్యాలయానికి అమిత్ షా వెళ్తారు. ఇక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం రెండున్నర గంటలకు... నిజామాబాద్- కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం ఐదున్నర గంటలకు ఢిల్లీకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కాగా రేపటి అమిత్ షా సభను రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డు కల 40 ఏళ్ల చరిత్ర అన్నారు. ఆ కల సాకారమవుతున్న వేళ రేపు రైతులకు పండగ అని తెలిపారు. ఈ బోర్డు ద్వారా పసుపు రైతులకు ఎనలేని మేలు చేకూరనుందని పేర్కొన్నారు. పసుపు పరిశోధనపై కొత్త అధ్యయనం మొదలుకానుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.

Next Story