కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఊరట : కిమ్స్ సీఎండీ డా. బొల్లినేని భాస్కర్ రావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 15:04:47  IST  )

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమగ్ర వృద్ధికి, ప్రజా సంక్షేమానికి అద్దం పడుతోందని కిమ్స్ సీఎండీ డా. బొల్లినేని భాస్కర్ రావు అన్నారు.

కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఊరట : కిమ్స్ సీఎండీ డా. బొల్లినేని భాస్కర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమగ్ర వృద్ధికి, ప్రజా సంక్షేమానికి అద్దం పడుతోందని కిమ్స్ సీఎండీ డా. బొల్లినేని భాస్కర్ రావు అన్నారు. ముఖ్యంగా 17 రకాల క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయడంతో పాటు, మరో ఏడు రకాల అరుదైన వ్యాధుల మందులకు మినహాయింపు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం వల్ల చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గి, ప్రాణరక్షక మందులు రోగులకు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది బాధిత కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వైద్యులు కూడా మెరుగైన చికిత్స అందించడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు దోహదపడుతుందన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి భారీగా నిధులు కేటాయించడం దేశాభివృద్ధికి కీలకమని తెలిపారు. పటిష్టమైన మౌలిక సదుపాయాల వల్ల కేవలం ఆర్థిక వృద్ధే కాకుండా, ఆరోగ్య సేవలు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. సామాజిక బాధ్యత, దీర్ఘకాలిక అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రజల సంక్షేమమే కేంద్రంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు.

Next Story