Union Budget 2025-26: నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-01 05:26:45  IST  )

మరికొద్దిసేపట్లోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్నారు.

Union Budget 2025-26: నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్దిసేపట్లోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలతో పాటు రేవంత్ సర్కార్ బడ్జెట్‌లో తెలంగాణ (Telangana)కు ఎంత మేర నిధులు కేటాయిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బడ్జెట్‌కు ముందు రాష్ట్రంలోని వివిధ పార్టీల నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు నిధుల విషయంలో వినతిపత్రాలు సమర్పించారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రిజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి రూ.34,367 కోట్లు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ (DPR)ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ (Union Urban Development Minister Manohar Lal Khattar)కు అందజేసింది.

ఇక హైదరాబాద్‌‌ (Hyderabad)లోని మేడ్చల్ (Medchal) కేంద్రంగా మెట్రో రెండో దశ పనులకు రూ.24,269 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. మూసీ పునరుజ్జీవం (Musi Renaissance) కోసం రూ.14,100 కోట్ల నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్ధించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన (Pradhan Mantri Aawas Yojana) కింద నిధులు కేటాయించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి సుమారు రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని రేవంత్ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

కాగా, నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హోసింగ్ ఫర్ ఆల్ పేరుతో స్కీం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. 8వ సారి పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌‌ను రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేతన జీవులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story