- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Danam : ఏక పక్ష కూల్చివేతలు సరికాదు : ఎమ్మెల్యే దానం మండిపాటు
ఆక్రమణ(Encroachments)ల తొలగింపు(Removal)పేరుతో అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతు పేదలను ఇబ్బంది(Trouble The Poor) పెడుతున్నారని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) మరోసారి మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆక్రమణ(Encroachments)ల తొలగింపు(Removal)పేరుతో అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతు పేదలను ఇబ్బంది(Trouble The Poor) పెడుతున్నారని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) మరోసారి మండిపడ్డారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునే వారిని అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. రోజువారి వ్యాపారం చేసుకునే వారికి రోజు వ్యాపారం చేసుకుంటేనే వారి జీవనం గడుస్తుందని..అలాంటి వారిని ఇబ్బంది పెడితే వారి శాపనార్ధాలు మనకు మంచిది కాదన్నారు.
గతంలో ప్రభుత్వాలు వారి పట్ల మానవీయ కోణంలో వ్యహరించాయన్నారు. ఇరుకు రోడ్లు ఉన్న చోట ఆక్రమణలు తొలగింపు చేపట్టాలని ప్రభుత్వం చెబితే అధికారులు మాత్రం వారికి తోచిన చోట అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెలుతానన్నారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునే వారిని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. కూల్చివేతలు చేయాలంటే అధికారులు ముందు ఓల్డ్ సిటీ నుండి మొదలు పెట్టాలని, ఓల్డ్ సిటీలో కూల్చేస్తే మా దగ్గర కూడా కూల్చండన్నారు.
కాగా నిన్న తన నియోజకవర్గంలో షాదాన్ కాలేజీ ఎదురుగా ఫుట్ పాత్ ల ఆక్రమణల కూల్చివేతలను స్వయంగా అడ్డుకుని అధికారులకు దానం వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం లేకుండా కూల్చివేతలు ఏమిటని మండిపడ్డారు. కూల్చివేతలు ఆపకపోతే పదవి పోయిన సరే రోడ్డు మీద బైఠాయిస్తానని, రోజువారి జీవనం కోసం వ్యాపారం చేసే వారిపై దౌర్జన్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చేవరకు కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఈ రోజు కూడా మీడియాతో దానం కూల్చివేతలను తప్పుబడుతు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగాను చర్చనీయాంశమయ్యాయి.






