MLC Kalvakuntla Kavitha : కవితకు మహిళల నుంచి ఊహించని షాక్.. (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-03-30 17:06:39  IST  )

ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న కవితకు ఆదిలాబాద్ జిల్లా మహిళలు ఝలక్ ఇచ్చారు.

MLC Kalvakuntla Kavitha : కవితకు మహిళల నుంచి ఊహించని షాక్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న కవితకు ఆదిలాబాద్ జిల్లా మహిళలు ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు భారీ ర్యాలీ తీశారు. కవితకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ పట్టణ రోడ్లపై నిరసన ర్యాలీ తీశారు. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story