రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్లాట్లకు అనూహ్యస్పందన

by velandi.Saikiran |

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ప్లాట్లకు అనూహ్య స్పందన వచ్చింది. రాయదుర్గంలో రాబోయే రెండు కీలకమైన ల్యాండ్ పార్సెళ్ల ఈ-వేలం

రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్లాట్లకు అనూహ్యస్పందన
X

రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్లాట్లకు అనూహ్యస్పందన

* ప్రీ-బిడ్ సమావేశం విజయవంతం

* టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కె. శశాంక

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ప్లాట్లకు అనూహ్య స్పందన వచ్చింది. రాయదుర్గంలో రాబోయే రెండు కీలకమైన ల్యాండ్ పార్సెళ్ల ఈ-వేలం కోసం బుధవారం రాయదుర్గంలోని టీ-హబ్‌లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశం విజయవంతమైందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ప్రకటించింది. ఈ సమావేశానికి బ్యాంకర్లు, కన్సల్టెంట్లతో పాటు 27కు పైగా ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కొందరు నేరుగా, మరి కొందరు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఈ ప్రీ-బిడ్ సమావేశాన్ని టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక ప్రారంభోపన్యాసంతో ప్రారంభించారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్న తీరును, రాయదుర్గం కారిడార్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు. మెటల్ స్ర్కాప్ ట్రెడ్ కార్పోరేషన్ లిమిటెడ్ (MSTC) పటిష్టమైన ఆన్‌లైన్ ప్లాట్‌ ఫాం ద్వారా పారదర్శకమైన, న్యాయమైన, పోటీతో కూడిన వేలం ప్రక్రియను నిర్వహించడానికి టీజీఐఐసీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రీ-బిడ్ సమావేశంలో 27కు పైగా కార్పొరేట్లు, డెవలపర్లు వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లో ఉత్సాహంగా పాల్గొనడం రాయదుర్గం, హైదరాబాద్‌పై ఉన్న అపారమైన ఆసక్తిని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. నగరం యొక్క రూపురేఖలను మార్చి, దీర్ఘకాలిక విలువను సృష్టించే అరుదైన అవకాశాలు ఈ వేలం ద్వారా అందించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్లాట్ల కోసం ఈ-వేలం అక్టోబర్ 6న నిర్వహించనన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 19వ ప్లాటు (సుమారు 11 ఎకరాలు), 15వ ప్లాటు (సుమారు 7.67 ఎకరాలు) వేరు వేరుగా రెండు ల్యాండ్ పార్సెళ్లు అమ్మకానికి ఉన్నాయని వివరించారు. ప్రీ-బిడ్‌కు వచ్చిన ఈ స్పందన, రాబోయే వేలంలో తీవ్ర పోటీ, రికార్డు స్థాయి భాగస్వామ్యానికి నాంది పలుకుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ప్రముఖ పెట్టుబడిదారులు, డెవలపర్లకు ఎంత ఆకర్షణీయంగా ఉందో మరోసారి రుజువు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం, లావాదేవీల సలహాదారుగా నియమించిన జేఎల్ఎల్ (JLL) సీనియర్ డైరెక్టర్ సూర్య కిరణ్ బల్లా, ఈ అవకాశంపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి పథం, నగరం యొక్క అత్యంత ప్రీమియం బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా రాయదుర్గం యొక్క విశిష్ట స్థానం, ఫ్రీహోల్డ్, బహుళ-వినియోగ ప్లాట్లు అందిస్తున్న అరుదైన సామర్థ్యాలను ప్రదర్శించారు. ఆ తర్వాత ఎం.ఎస్.టీ.సీ మరో అధికారి జమీల్ అక్తర్ ఈ-వేలం ప్రక్రియపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ (EMD) సమర్పణ, బిడ్డింగ్ మెకానిక్స్ గురించి పాల్గొనేవారికి మార్గనిర్దేశం చేశారు. ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించిన భద్రతా చర్యల గురించి పునరుద్ఘాటించారు.

Next Story