- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. ఘోష్ నివేదికను రద్దు చేయాలని రిటైర్డ్ CS హైకోర్టులో పిటిషన్
రాష్ట్రంలో కాళేశ్వరం (Kaleshwaram) నివేదికపై రచ్చ కొనసాగుతోన్న వేళ బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాళేశ్వరం (Kaleshwaram) నివేదికపై రచ్చ కొనసాగుతోన్న వేళ బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మేరకు జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని రిటైర్డ్ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి (SK Joshi) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, విచారణలో భాగంగా చంద్రఘోష్ కమిషన్ సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చిందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంత వరకు తరకు ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వలేదని, తనపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, శైలేంద్ర కుమార్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
Next Story






