జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్‌లు విడుదల చేయాలి.. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

by Ramesh Naini |   (  Updated:2025-07-01 13:00:55  IST  )

జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్‌లు విడుదల చేయాలి.. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల చేయాలని (Unemployed Youth) నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ చిక్కడపల్లి (City Central Library) లైబ్రరీలో ప్లకార్డులు పట్టుకోని ప్రభుత్వంపై నిరసన తెలిపారు. 18 నెలలుగా నోటిఫికేషన్ల కోసం ప్రతి లైబ్రరీలో ఎదురు చూస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌లు ఇస్తుంటే యువత వద్దని చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, మరి మీరు వేసిన నోటిఫికేషన్లు ఎక్కడ సార్.. అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో.. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకోని గెలిచిన ప్రభుత్వం.. నేడు అదే నిరుద్యోగులని అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వనని ఒక మాట చెబితే.. లైబ్రరీలో ఉండకుండా వేరే పనులు వెతుకుంటామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిరసన నేపథ్యంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. నిరుద్యోగలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నేడు నిరుద్యోగుల పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. నోటిఫికేషన్స్ వద్దు అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు అందరూ నోరు తెరిస్తే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story