ప్రజాదరణను ఓర్వలేక పిచ్చిరాతలు : ఎంపీ ‘చామల’ ఫైర్

by Muthe.Rajitha |

కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పిచ్చిరాతలు రాయిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి విమర్శించారు.

ప్రజాదరణను ఓర్వలేక పిచ్చిరాతలు :  ఎంపీ ‘చామల’ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పిచ్చిరాతలు రాయిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, దాంతో ఆయన ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారని, దీనికోసం కమిటీ కూడా వేసాడని ఒక పత్రికల్లో ప్రచురించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్​రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... చెత్త న్యూస్ రాయించి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని బీఆర్ఎస్​ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల్లో తెలంగాణ కాంగ్రెస్​ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి పిచ్చి రాతలు రాయించి రాక్షసానందాన్ని పొందుతుందని ఎంపీ దుయ్యబట్టారు.

Next Story