HYD: లోక్ భవన్‌లో ఉగాది వేడుకలు

by Gantepaka Srikanth |

లోక్ భవన్ లో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు.

HYD: లోక్ భవన్‌లో ఉగాది వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ భవన్ లో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గత అనుభవాల నుండి నేర్చుకుంటూ, మరింత నిబద్ధతతో, సేవాభావంతో మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఉగాది అంటేనే కొత్త శకం. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మన జీవితంలోని కష్ట సుఖాల కలయికను సూచిస్తుందన్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో తెలంగాణ కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్ అపరేష్ కుమార్ సింగ్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్,.రాంచందర్ రావు, ప్రభుత్వప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్, అర్మీ అధికారులు, హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Next Story