మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన టూ వీలర్.. ఇద్దరు స్పాట్ డెడ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-23 10:35:07  IST  )

హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.

మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన టూ వీలర్.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. టూ వీలర్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతులను మధు, హరీశ్ లుగా గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరూ తాగి ఉన్నారా? అందుకే ఈ ప్రమాదం జరిగిందా? అన్న విషయం పోస్టుమార్టంలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Next Story