తెలంగాణ, యూపీ అసెంబ్లీల నిర్వాహణపై ఇరువురు స్పీకర్ల ముచ్చట

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా శాసనసభ నిర్వాహణపై ముచ్చటించారు.

తెలంగాణ, యూపీ అసెంబ్లీల నిర్వాహణపై ఇరువురు స్పీకర్ల ముచ్చట
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా శాసనసభ నిర్వాహణపై ముచ్చటించారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సతీష్ మహానా దంపతులు బంజారాహిల్స్ మంత్రుల నివాసంలోని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికార నివాసానికి విచ్చేసారు. తన నివాసానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ స్పీకర్ దంపతులను శాలువా, పుష్ప గుచ్ఛంతో సన్మానించి మెమొంటో బహుకరించించారు. అనంతరం వీరు ఆయా రాష్ట్రాల శాసనసభల నిర్వాహణపై ముచ్చటించారు. ఈ భేటీలో లేజిస్లేటివ్ సెక్రటరీ డా.వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.

Next Story