- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హౌస్ లోన్ మోసం కేసులో ఇద్దరికి 7 సంవత్సరాల శిక్ష జైలు శిక్ష
సీఐడి దర్యాప్తు చెపట్టిన హౌస్ లోన్ మోసంలో భార్యభర్తలకు నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 7సంవత్సరాల కఠిన

హౌస్ లోన్ మోసం కేసులో ఇద్దరికి 7 సంవత్సరాల శిక్ష జైలు శిక్ష
ఎస్‌బీఐ బ్యాంక్‌లో నకిలీ పత్రాలతో రూ.24లక్షల లోన్
మరో రెండు బ్యాంక్‌లలో సైతం లోన్లు
ఎస్‌బీఐ ఎజీఎం ఫిర్యాదులో విచారణ చెపట్టిన సీఐడి
దిశ, తెలంగాణ బ్యూరో: సీఐడి దర్యాప్తు చెపట్టిన హౌస్ లోన్ మోసంలో భార్యభర్తలకు నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 7సంవత్సరాల కఠిన కారాగాశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిట్లు సీఐడీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. రూ.30వేలు జరిమానా విధించినట్లు బుధవారం పత్రిక ప్రకటనలో పేర్కోన్నారు. వుప్పల దశరథ్, లక్ష్మీ బాయి దంపతులపై 2011లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సికింద్రాబాద్ బ్రాంచ్ ఏజీఎం ఫిర్యాదు తో సీఐడి దర్యాప్తు చేపట్టిన్లు తెలిపారు. 2007లో ఎయిర్ కార్గో బ్రాంచ్ నుంచి నకిలీ పత్రాలతో రూ.24లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు.
జీడిమెట్ల ప్రాంతంలో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్లు నకిలీ పత్రాలు బ్యాంక్‌కు సమర్పించారు. నకిలీ పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కూకట్ పల్లి బ్రాంచ్, కెనారా బ్యాంక్ కుందన్ బాగ్ బ్రాంచ్‌లో లోన్ తీసుకున్నట్లు గుర్తించినట్లు పేర్కోన్నారు. లోన్‌లను తిరిగి చెల్లించలేదని తెలిపారు. దర్యాప్తు చేపట్టిన సీఐడి 17 సాక్ష్యధారాలతో 60 డ్యాక్యూమెంట్లను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. చీటింగ్ , ఫోర్జరీ, నేరపూరత కుట్ర కింద నమోదైన కేసులను విచారించిన నాంపల్లి కోర్టు శిక్ష విధించినట్లు పేర్కోన్నారు.






