- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road accidents: దట్టంగా కమ్మేసిన పొగమంచు.. పండగ పూట వరుస రోడ్డు ప్రమాదాలు
by Prasad Jukanti |
రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది

X
దిశ, డైనమిక్ బ్యూరో: కనుమ పండగ వేళ రోడ్డు ప్రమాదాలు (Road accidents) భయపెట్టాయి. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై (Khammam–Devarapalli Greenfield Highway) రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. తల్లాడ మండలం పాత పినపాక వద్ద ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ను ఓ కారు ఢీ కొట్టింది. వైరా మండలం సోమవరం వద్ద రెండు కార్లు ఢీ కొన్నారు. ఈ రెండు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను ప్రారంభించకముందే ప్రమాదాలు జరగడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ కారణంగా అధికారులు ఈ హైవేపై వాహనాలను అనుమతించారు.
Next Story






