- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజ్వేల్‌లో ఘోరం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు దుర్మరణం
సిద్దిపేట జిల్లా గజ్వేల్(Gajwel) పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు(Police Constables) దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్/గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్(Gajwel) పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు(Police Constables) దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున జాలిగామ బైపాస్(Jaligama bypass) రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పరంధాములు, మరొకరు దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ పాల్గొనడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






