Encounter: మావోయిస్టులకు మరో షాక్.. తాజా ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు మృతి

by Prasad Jukanti |
Encounter: మావోయిస్టులకు మరో షాక్.. తాజా ఎన్ కౌంటర్ లో  అగ్రనేతలు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో/భద్రాచలం: ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత కొనసాగతూనే ఉంది. బస్తర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా కొండగావ్-నారాయణ్ పుర్ సరిహద్దుల్లోని అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో (Kondagaon-Narayanpur encounter) ఇద్దరు మావోయిస్టు అగ్రనేత, కమాండర్ హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామి మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ బుధవారం తెలిపారు. సమీపంలోని అడవువల్లో మావోయిస్టులు (Maoists) సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళాలు మంగళవారం సాయంత్రం కూంబింక్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ఘటనలో హల్దార్, రామి మృతదేహాలు, ఏకే -47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా హల్దార్ పై రూ. 8 లక్షలు, రామిపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు. తాజా ఎన్ కౌంటర్ తో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ కాగా వీరిలో ఒక్క బస్తర్ డివిజన్ లోనే 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 2026 మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed