HMDA: హెచ్ఎండీఏలో మరో ఇద్దరు ప్లానింగ్ డైరెక్టర్లుగా పదోన్నతులు

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో ఇద్దరికి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ)లకు ప్రభుత్వం డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది.

HMDA: హెచ్ఎండీఏలో మరో ఇద్దరు ప్లానింగ్ డైరెక్టర్లుగా పదోన్నతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో ఇద్దరికి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ)లకు ప్రభుత్వం డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. దీంతో హెచ్ఎండీఏలో డైరెక్టర్ల సంఖ్య నాలుగుకు చేరింది. సీపీఓలు యశ్వంత్ రావు, వికాస్‌లకు ప్లానింగ్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. హెచ్ఎండీఏలో ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. మేడ్చల్-1,2 జోన్‌లతో పాటు ఘట్ కేసర్ జోన్ డైరెక్టర్ గా కె.విద్యాధర్, శంకర్ పల్లి-1, 2 జోన్‌లతోపాటు శంషాబాద్ జోన్ డైరెక్టర్‌గా రాజేంద్రప్రసాద్ నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ ఆరు జోన్‌లతోపాటు సిటీ ఏరియా ప్రత్యేక జోన్‌గా ఉంది.

10 ఫ్లోర్లు దాటితే హెచ్ఎండీఏ పర్మిషన్

అలాగే, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలకు 10 ఫ్లోర్లు (30 మీటర్లు) వరకు ఉన్న బిల్డింగ్ పర్మిషన్లు మాత్రమే జారీ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 ఫ్లోర్లు దాటితే వాటికి హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నలుగురు డైరెక్టర్లకు జోన్ల కేటాయింపు తర్వలో ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Next Story