షాకింగ్‌.. CM రేవంత్‌ను కలిసిన మరో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-21 12:08:12  IST  )

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) వరుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలుస్తున్నారు.

షాకింగ్‌.. CM రేవంత్‌ను కలిసిన మరో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) వరుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలుస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy), మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)లు కలిశారు. శుక్రవారం సీఎం ఛాంబర్‌లో కుటుంబసభ్యులతోవెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపె కోసమే కలిసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు హరీష్ రావు, పద్మారావు గౌడ్‌లు కూడా సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు.. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Activists) కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress Govt) వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను(Election Assurances) నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. రైతులకు మద్దతు ధర, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థినులకు స్కూటర్లు వంటి హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని ఆరోపించారు.

Next Story