- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్!
by GSrikanth |
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాయి లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు సుష్మిత కోసం ప్రవీణ్ వద్ద నుంచి లౌకిక్ రూ.6 లక్షలకు డీఏవో క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా లౌకిక్, సుష్మితను అదుపులోకి రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా డీఏవో పరీక్ష ఫిబ్రవరి 26న జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే ఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది.
Next Story






