స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-11 11:20:31  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్‌(Telangana Congress)కు బిగ్ షాక్ తగిలింది.

స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్‌(Telangana Congress)కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ ST మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ నేతృత్వంలో భారీగా కాంగ్రెస్ నుంచి బీజేపీ(Telangana BJP)లో చేరారు. వారికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఢిల్లీలోని ఆమె నివాసంలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ సహా వారి అనుచరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరడం సంతోషకరంగా ఉందని అన్నారు. కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు ఉంటుందని ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.

అధికారంలోకి రావడమే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్(Congress Govt) ఇచ్చిన ఏ గ్యారంటీ కూడా సరిగా అమలు కావడం లేదని అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన కూడా తప్పులతడకగా ఉందని మండిపడ్డారు. బీసీ జనాభాను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్ నేతల తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ నేనావత్, రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ పాల్గొన్నారు.

Next Story