- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరు దుర్మరణం
by Naga Rani Yarlagadda |
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బంగల్ పేట్ వద్ద మహాలక్ష్మివాడలోని సి బ్లాక్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఫ్రిడ్జ్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల స్థానికులు వెంటనే అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ (40), ఇంటి యజమాని ఒడిసెల విజయ్ (50) మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వేసవిలో ఫ్రిడ్జ్ లు, ఏసీల వాడకాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Next Story






