- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: రాత్రి పూట అడవిలో నడక.. అక్కడే నైట్ స్టే, ఉదయం ట్రెక్కింగ్
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నేచర్ క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నేచర్ క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. శనివారం ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నేచర్ క్యాంప్ కు వచ్చిన సందర్శకులకు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తారు. అలాగే బోటానికల్ గార్డెన్ లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు "బోటానికల్ గార్డెన్ లో బర్డ్ వాక్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, పాల్గొనే వారు పక్షుల జాతులను గుర్తించడం, పక్షులు ఎప్పుడు, ఎక్కడ గూళ్ళు కడతాయో తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు పూర్తి వివరాల కోసం 98852 98980, 94935 49399 నెంబర్ లను సంప్రదించాలని కోరారు.






