- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటలో పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న సికింద్రాబాద్‌లోని ప్యారడైస్‌లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్‌లో రెండేళ్ల బాబును నిందితులు ఎత్తుకుని వెళ్లారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న సికింద్రాబాద్‌లోని ప్యారడైస్‌లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్‌లో రెండేళ్ల బాబును నిందితులు ఎత్తుకుని వెళ్లారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు చేధించారు. అయితే హైదరాబాద్‌లో కిడ్నాప్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యారడైస్ ఫుట్‌పాత్ దగ్గర కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు పాప కిడ్నాప్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో దీంతో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు..కిడ్నాపర్లను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దంపతుల దగ్గర కిడ్నాప్ అయిన పాపతో పాటు మరో చిన్నారిని కూడా వారు గుర్తించారు. ఇద్దరు చిన్నారులను క్షేమంగా పోలీస్ స్టేషన్ తరలించారు. కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.






