- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ కానిస్టేబుళ్లు అరెస్టు
కూకట్‌పల్లి డ్రగ్స్ కేసు(Kukatpally drugs case)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్ (40), హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర అనే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్లను తెలంగాణలోని సైబరాబాద్ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసు(Kukatpally drugs case)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్ (40), హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర అనే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్లను తెలంగాణలోని సైబరాబాద్ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో సుమారు రూ. 2 కోట్ల విలువైన 820 గ్రాముల ఎఫిడ్రిన్ (కొకైన్‌తో కలిపిన డ్రగ్), ఒక డిజిటల్ వెయిట్ మిషన్, ఐదు మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు.
గుణ శేఖర్‌ను ఈ డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులున్నారని, వీరిలో గుణ శేఖర్‌తో పాటు మరో వ్యక్తి అప్పన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు కూడా బాపట్ల జిల్లా అద్దంకి చెందిన వారిగా గుర్తించారు. గుణ శేఖర్ ఈ ఎఫిడ్రిన్ డ్రగ్‌ను ఎవరికి సరఫరా చేశాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది






