దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణలో ట్విస్ట్.. హాజరుకాని దానం, మార్చి 2కి వాయిదా

by Ramesh Naini |

దానం పార్టీ మారారని ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపైన స్పీకర్ ఛాంబర్‌లో విచారణ జరిగింది. ఈ విచారణకు దానం నాగేందర్ గైర్హాజరు అయ్యారు.

దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణలో ట్విస్ట్.. హాజరుకాని దానం, మార్చి 2కి వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం విచారించారు. దానం పార్టీ మారారని ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపైన స్పీకర్ ఛాంబర్‌లో విచారణ జరిగింది. అయితే, ఈ విచారణకు దానం నాగేందర్ గైర్హాజరు అయ్యారు. దానం తరుపు న్యాయవాదులను పిటిషనర్ల తరుఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆధారాలకు సంబంధించిన అఫిడవిట్ లను దానం న్యాయవాదులు దాఖలు చేయలేదని తెలిసింది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి స్పీకర్ వాయిదా వేశారు.

కడియం పిటిషన్‌పై విచారణ

ఆ విచారణను స్పీకర్ ముందు ఇరువర్గాలు తమ వాదనలు మౌఖికంగా వినిపించనున్నారు. శనివారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారణ చేపట్టనున్నారు. కడియం పిటిషన్​ విచారణతో పది మందిపైన దాఖలైన పిటిషన్లను స్పీకర్ విచారించినట్లు అవుతుంది. కాగా, ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాటిని ఇటీవల కొట్టి వేశారు. ప్రస్తుతం దానం, కడియంల పిటిషన్ల విచారణను స్పీకర్ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story