తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయ్ ప్రభంజనం.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

by Ramesh Naini |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయ్ ప్రభంజనం.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ టీవీకే అధినేత విజయ్‌కు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ సాధించిన విజయాన్ని కొనియాడుతూ చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ చక్కటి పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ప్రియమైన విజయ్.. తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇదే సంకల్పంతో, స్పష్టమైన లక్ష్యంతో ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ, వారిని ముందుండి నడిపిస్తూ సేవలు అందించాలని ఆశిస్తున్నాను. తమిళనాడు రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు మీరు భవిష్యత్తులో చేయబోయే ప్రజాసేవకు నా తరపున బెస్ట్’ అని పేర్కొన్నారు.

విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే ప్రజల మద్దతు కూడగట్టుకుని ఎన్నికల బరిలో నిలవడం, తొలి పోరులోనే సత్తా చాటడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు, తమిళనాడులోని విజయ్ అభిమానులు ఈ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు.

Next Story