టీవీకే పార్టీ మరో అరుదైన రికార్డ్.. 234 నియోజకవర్గాల్లో డిపాజిట్లు సేఫ్

by Kema Shiva Kumar |

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే రికార్డుల మోత మోగించింది. 108 స్థానాల్లో గెలుపు, ఒక్క చోట కూడా డిపాజిట్ కోల్పోకుండా విజయ్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది.

టీవీకే పార్టీ మరో అరుదైన రికార్డ్.. 234 నియోజకవర్గాల్లో డిపాజిట్లు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మరో అదుదైన రికార్డును సొంత చేసుకుంది. కేవలం పార్టీ అభ్యర్థులు గెలవడమే కాకుండా, విన్నింగ్ మార్జిన్లు, ఓట్ల శాతం పరంగా దశాబ్దాల చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలనే విస్మయానికి గురిచేసింది. అయితే, బడా పార్టీలకే కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కని పరిస్థితి ఉన్న వేళ, టీవీకే పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ డిపాజిట్ కోల్పోకపోవడం విశేషం. గెలిచిన 108 స్థానాల్లో టీవీకే అభ్యర్థుల సగటు విన్నింగ్ మార్జిన్ 22,842 ఓట్లుగా నమోదైంది. ఇక విన్నింగ్ మార్జిన్లలో డీఎంకే (DMK) 9,310, ఏఐఏడీఎంకే (AIDMK) 15,164 లను టీవీకే దాటేసింది. ముఖ్యంగా అధికార డీఎంకే కంటే టీవీకే అభ్యర్థులు 2.5 రెట్లు ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. సినిమా గ్లామర్‌తో పాటు పక్కా ఎజెండాతో వచ్చిన విజయ్, తొలి ప్రయత్నంలోనే ఓటర్ల బలమైన నమ్మకాన్ని గెలుచుకుని తమిళ రాజకీయాల్లో తలపతి విజయ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

Next Story